Telangana: 500కే గ్యాస్ సిలిండర్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..
రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ హామీ అమలుపై కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. 100 రోజుల్లోనే అమలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈమేరకు సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పౌరసరఫరాలశాఖ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.