Latest News In Telugu Telangana: ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. టీటీడీపీ అధ్యక్షుడి సంచలన ప్రకటన.. తెలంగాణ ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించారు. పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని కోరారు కాసాని. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఏపీపైనే దృష్టి పెట్టింది. దీంతో తెలంగాణపై ఫోకస్ చేయలేని పరిస్థితి నెలకొంది. అందుకే తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని తెలంగాణ నేతలకు చంద్రబాబు సూచించారని తెలుస్తుంది. By Shiva.K 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అదే జరిగితే రేవంత్ ఎప్పుడో జైలుకెళ్లేవాడు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్.. తాము ప్రతీకార రాజకీయాలు చేసుంటే రేవంత్ రెడ్డి ఎప్పుడో జైలుకు వెళ్లేవాడని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధిపైనే తాము ఫోకస్ పెట్టామన్నారు. దశాబ్దాల పాటు తెలంగాణ ఆకాంక్షలను అణచివేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. నాడు సోనియాను బలిదేవత అన్నది రేవంతే అని గుర్తు చేశారు కేటీఆర్. భారత దేశానికి తెలంగాణ దిక్సూచి అని పేర్కొన్నారు. అది కేసీఆర్ సాధించిన ఘనత అని అన్నారు. తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోందని పేర్కొన్నారు. By Shiva.K 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: దేవరకొండలో బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి గుత్తా అనుచరులు.. నల్లగొండ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. తాజాగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాన అనుచరులు దేవరకొండ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, ఎంపీపీ జాన్ యాదవ్, సిరందాస్ కృష్ణయ్య, లక్ష్మమ్మ, కృష్ణయ్య, వడ్త్యా దేవేందర్ నాయక్ సహా పలువురు కాంగ్రెస్‌లో చేరారు. By Shiva.K 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ex MLA Babu Mohan: బీజేపీపై ఆగ్రహం.. బాబు మోహన్ సంచలన నిర్ణయం.. బీజేపీ నాయకుడు బాబుమోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు, బీజేపీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు ప్రకటించారు. దీనంతటికీ కారణం.. తనకు టికెట్ కేటాయింపు విషయంలో బీజేపీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరే అని బాబుమోహన్ అంటున్నారు. టికెట్ తన కొడుక్కి ఇస్తారా? తనకు ఇస్తారా? క్లారిటీ ఇవ్వాలన్నారు. టికెట్ పేరుతో తనకు, తన కొడుక్కి మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. తన ఫోన్‌కు అగ్రనేతలెవరూ రెస్పాండ్ అవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. By Shiva.K 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సర్వేలన్నీ నాకే అనుకూలంగా ఉన్నాయి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించడమే తన లక్ష్యమని తెలిపారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. By B Aravind 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: కాంగ్రెస్‌లో వారికి జాక్‌పాట్.. పార్టీలో చేరడమే ఆలస్యం టికెట్ల కేటాయింపు.. కాంగ్రెస్ పార్టీ కొందరు నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. పార్టీలో చేరడమే ఆలస్యం అన్నట్లుగా పలువురు నేతలకు టికెట్లు కన్ఫామ్ చేసింది. మరికొందరు పేర్లను హోల్డ్ లో ఉంచినా.. వారికి కూడా కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న నేతల్లో ప్రముఖంగా మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాలేరు - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు సహా తదితర నేతలు ఉన్నారు. By Shiva.K 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేసీఆర్‌ను ఓడించే మొగోడు రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించే మొగోడు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సాధించే తొలి విజయం కామారెడ్డే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ తిన్నదంతా కక్కిస్తామన్నారు జీవన్ రెడ్డి. ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌కు అవగాహన లేకపోతే.. ఇంజనీర్లకు లేదా? అని ప్రశ్నించారు. ఈఎన్సీ మురళీధర్ రావును జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. By Shiva.K 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల.. తుమ్మల, పొంగులేటి పోటీపై క్లారిటీ.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలైంది. 45 మంది అభ్యర్థులకు సీట్లు కన్ఫామ్ చేస్తూ జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, కొండా సురేఖ సహా ఇతర ముఖ్య నేతలకు ఈ జాబితాలో సీట్ కన్ఫామ్ చేశారు. By Shiva.K 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: కాంగ్రెస్, బీజేపీపై మంత్రి కేటీఆర్ మాస్ సెటైర్లు.. సిరిసిల్ల రాజకీయలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో మాట్లాడిన ఆయన.. తాను అభివృద్ధి చేయకపోతే తనకు ఓటు వేయొద్దని స్పష్టం చేశారు. ఎన్నికల వేళ ఎవరెవరో వచ్చి ఏదేదో చెబుతారని, ఆగం కావొద్దని ప్రజలను కోరారు. తాను చేసిన పని కళ్ల ముందు కనపడుతోందన్నారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఆగం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు మంత్రి. By Shiva.K 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn