BREAKING: బీజేపీకి విజయశాంతి రాజీనామా!
తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించినట్లు సమాచారం.
తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించినట్లు సమాచారం.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. గత్త ఎన్నికల్లో కొందరు బుర్ఖాలో వచ్చి దొంగ ఓట్లు వేశారని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఈవో వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల్లో ఇలా జరగకుండా చూడాలని వారిని కోరినట్లు తెలిపారు.
నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సందర్భంగా.. కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేసే వారికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికులందరూ ఓటు వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
అనేక నాటకీయ పరిణామాల నడుమ సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి ఈ రోజు తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. హైకమాండ్ పెద్దల హామీతో పాటు నల్గొండ ఎంపీగా పోటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి హామీ పత్రాలు ఇవ్వడంతో రమేష్ రెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లను గెలుచుకుంటుందని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 సీట్లను గెలుస్తామన్నారు. ఈ రోజు ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
వివేక్ వెంకటస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత. పేద దళిత బిడ్డలు ఒకవైపు, పెట్టుబడిదారులు మరొకవైపు ...పెద్దపల్లిలో బరిలో దిగారన్నారు. ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు...పార్టీ మార్చే నేతలకు పెద్దపల్లి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
పార్టీ పెద్దల సూచనలతో సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డితో పాటు బాన్సువాడ - కాసుల బాలరాజ్, జుక్కల్ - గంగారాం, వరంగల్ వెస్ట్ - జంగా రాఘవరెడ్డి, డోర్నకల్ - నెహ్రూ నాయక్, ఇబ్రహీంపట్నం - దండెం రామిరెడ్డి తదితర కాంగ్రెస్ రెబల్స్ ఈ రోజు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
రేవంత్ రెడ్డి పెద్ద దొంగ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య. రేవంత్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజానీకానికి అంతా తెలుసన్నారు. సీఎం కేసీఆర్, చేపట్టిన సక్షేంమ పథకాలే భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. బోథ్‌లో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని.. అలాగే డిసెంబర్ 31లోపు బోథ్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చారు.