BREAKING: తెలంగాణలో ముగిసిన పోలింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా అంతా సవ్యంగానే జరిగినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో పోలింగ్ జరగగా అత్యల్పంగా హైదరాబాద్లో నమోదైంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా అంతా సవ్యంగానే జరిగినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో పోలింగ్ జరగగా అత్యల్పంగా హైదరాబాద్లో నమోదైంది.
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జోరుగా సాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు 62 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. జిల్లాల్లో అత్యధికంగా మెదక్లో 70 శాతం, అత్యల్పంగా హైదరాబాద్లో 32 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 13 ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టుల ప్రభావమున్న ప్రాంతాల్లో 4 గంటలవరకే పోలింగ్ నిర్వహిస్తామని చెప్పిన అధికారులు నిర్దేశించిన సమయంలో పోలింగ్ బూత్ కు రానివారిని లోపలికి అనుమతించలేదు.
తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేగడి మైలారం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నిర్మల్లో పార్టీ కండువాతో ఓటు వేసిన ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదైంది. మణికొండలో లాఠీఛార్జ్ చేశారు పోలీసులు.
గ్రేటర్ హైదరాబాద్ లో నెమ్మదిగా పోలింగ్ జరగడంపై ఎన్నికల ప్రధానాధికారి సీఈవో వికాస్ రాజ్ స్పందించారు. గ్రామాల్లో ప్రజలు తమ ఓటు వేసేందుకు ఉత్సాహంగా కదిలివచ్చారు. అయితే అర్బన్ ఏరియాల్లో పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.
సడెన్ గా తెలంగాణలో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరిగింది. ఉదయం నుంచి మందకొడిగా ఉన్న పోలింగ్ ఒక్కసారిగా ఊపు అందుకుంది. ఇప్పటికి తెలంగాణ మొత్తంలో 44 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
ఎవరికివారు మాదే అధికారం అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది ఈరోజు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీలు తమ పార్టీలే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని ధీమాగా చెబుతున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామంలో డెవలప్ మెంట్ జరగలేదని అందుకే ఓటును బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. అంటు వైరా నియోజకవర్గంలో కొత్తమేడేపల్లి గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు.
తెలంగాణ పోలింగ్ షురూ అయిన తర్వాత కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య లోపులాటు, వాగ్వాదాలు జరిగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జీలు చేయవలసి వస్తోంది.