Weather : తెలంగాణలో 5 రోజులు వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఐదు రోజులపాటూ భారీ వర్షాలుపడొచ్చని తెలిపింది. ఈదురు గాలులు, వడగళ్ళతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.
తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఐదు రోజులపాటూ భారీ వర్షాలుపడొచ్చని తెలిపింది. ఈదురు గాలులు, వడగళ్ళతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.
తెలంగాణ మెగా డీఎస్సీ పరీక్షల కోసం అప్లికేషన్ స్వీకరణ మొదలైంది. మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చును. ఈరోజు ఈ దరఖాస్తుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను విడుదల చేసింది విద్యాశాఖ.
యాదాద్రి పేరు మళ్ళీ మారనుంది. యాదాద్రిని మళ్ళీ తిరిగి యాదగిరి గుట్టగానే మారుస్తామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య. ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తెలిపారు.
అమెరికాలో యాక్సిండెట్‌కు గురైన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసు మీద బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ స్పందిచారు. జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో నేడు ఆరవ రోజు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. దాంతో పాటూ ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది.
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. రైతులకు ఇచ్చినరూ. 2లక్షల రుణమాఫిపై కీలక నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరలోనే రైతు రుణమాఫీ అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది.
బొక్క బోర్లా పడ్డా బీఆర్ఎస్కు ఇంకా బుద్ధి రాలేదు అంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఈరోజు బీఆర్ ఎస్ తీరుమీద, కేసీఆర్ మీదనా మాటలతో విరుచుకుపడ్డారు. రారా చూసుకుందాం అంటూ సవాల్ చేశారు.
పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధుల మీద కసరత్తులు చేస్తోంది. కొంతమంది ఎంపీల షార్ట్ లిస్ట్‌ని రెడీ చేసింది. దాంతో పాటూ అశావహుల నుంచి అప్లికేషన్లను స్వీకరించింది.
తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అభయహస్తం దరఖాస్తుల లెక్కలు బయటకు వచ్చాయి. వీటిల్లో అన్నింటికన్నా మహాలక్ష్మి పథకానికే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.