TDP Lokesh : యువగళం ముగింపు సభకు ప్రత్యేక రైళ్లు
లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరంలో ఏర్పాటు చేయనున్నారు టీడీపీ నేతలు. ఈ సభ కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఈ సభకు హాజరు కానున్నారు.
లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరంలో ఏర్పాటు చేయనున్నారు టీడీపీ నేతలు. ఈ సభ కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఈ సభకు హాజరు కానున్నారు.
వచ్చే ఏపీ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్నారు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్. ఈరోజు జనసేన ముఖ్యనాయకులతో పవన్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయాలపై వారితో చర్చించారు. తమ అభిమానాన్ని ఓట్లుగా చేయండని జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు.
రాజకీయ సన్యాసం చేసిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్ళీ రీఎంట్రీ అన్న వార్తలు హల్ చల్ చేస్తోంది. గల్లా జయదేవ్ పాలిటిక్స్‌కు గుడ్ బై చెబుతున్న నేపథ్యంలో లగడపాటి రావడం కాయం అని అని చెబుతున్నారు.
తాత, కూతురు, మనవడు...ఇలా మూడు తరాలుగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న గల్లా ఫ్యామిలీ ఇప్పుడు వాటికి దూరం అవుతున్నారా? అంటే అవుననే చెబుతున్నారు. ఆ కుటుంబం నుంచి ప్రస్తుతం పాలిటిక్స్ లో ఉన్న గల్లా జయదేవ్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది.
ఆంధ్రలో వైసీపీకి షాక్ ఇస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వనున్నారు. ఇవాళ చంద్రబాబు సమక్షంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ సెంట్రల్ ఆఫీసులో జాయిన్ కానున్నారు.
కర్నూలలో ఈ రోజు జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో మరో సారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.
అమెరికా సర్వర్లతో 40 లక్షల దొంగ ఓట్లు చేర్పించారంటూ టీడీపీపై వైసీపీ ఎంపీలు ఆరోపించారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎంపీలు.
టీడీపీ ఛీఫ్ చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో జగన్ సర్కార్ కూలిపోవడం ఖాయమని అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఎవరు ఆ వైసీపీ ఎమ్మెల్యేలు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.