బైక్ పై స్పీడుగా వెళ్లాడని దళిత యువకుణ్ణి కొట్టిన ముఠా!
రైల్వే గేటు దగ్గర బండిని వేగంగా నడిపినందుకు ఓ వ్యక్తి పై కూలదూషణ చేయడంతో పాటు తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన ఘటన తమిళనాడులో జరిగింది.
రైల్వే గేటు దగ్గర బండిని వేగంగా నడిపినందుకు ఓ వ్యక్తి పై కూలదూషణ చేయడంతో పాటు తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన ఘటన తమిళనాడులో జరిగింది.
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలుండడంతో అధికారులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
తమిళనాడు కి చెందిన ఓ టీ ఎస్టేట్ యజమాని తన ఉద్యోగులకు దీపావళి కానుకగా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ అందించి వారిని సంతోషంలో ముంచెత్తాడు.
కర్ణాటక దావణగెరె జిల్లాలోని లోకికెరె ప్రాంత ప్రజలు సుమారు 200 సంవత్సరాల నుంచి దీపావళి పర్వదినానికి దూరంగా ఉంటున్నారు.గతంలో జరిగిన సంఘటనల వల్ల దీపావళిని చీకటి రోజుగా భావిస్తారు ఆ గ్రామ ప్రజలు.
చెన్నైతో పాటు పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో చెన్నైలోని ప్రధాన రహదారులన్ని కూడా మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తమిళనాడు, కేరళలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం జల్లులు కురుస్తున్నాయి. దీంతో తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. అటు రాజస్థాన్ లో కూడా వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు.
తమిళనాడులో మరోసారి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 10 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మధ్య కాలంలో ఇలా పేలుడు సంభవించడం ఇది మూడో సారి.