T20 World Cup : మొదటి మ్యాచ్‌లోనే పాక్‌కు షాక్.. అమెరికా సంచలన విజయం
అమెరికా సంచలనం సృష్టించింది. పెద్ద జట్టు పాక్‌ను చిత్తు చేసింది. గ్రూప్ ఎ లో డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో గెలుపొందింది.
అమెరికా సంచలనం సృష్టించింది. పెద్ద జట్టు పాక్‌ను చిత్తు చేసింది. గ్రూప్ ఎ లో డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో గెలుపొందింది.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన డేవిడ్ వార్నర్.. టీ20ల్లో అత్యధిక 50+ ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసాడు.
బౌలింగ్‌తో అవతలి జట్టును భయపెట్టారు..బ్యాటింగ్‌లో మెరిసారు. మొత్తానికి టీ20 వరల్డ్‌కప్‌లో మనవాళ్ళు మంచి బోణీ కొట్టారు. నిన్న న్యూయార్క్ లో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ మీద 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
ప్రపంచకప్‌కు సమయం ఆసన్నమైంది. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఈరోజు మొదటి మ్యాచ్ ఆడనుంది. ఐర్లాండ్‌తో న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు తలపడనుంది.
రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్...ఆడింది పసికూనల మీద కానీ ఇప్పుడు మాత్రం నెగ్గడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. ఇదీ ప్రస్తుతం వెస్టిండీస్ పరిస్థితి. నిన్న పపువా న్యూగియాతో జరిగిన మ్యాచ్‌లో చెమటోడ్చి 5వికెట్ల తేడాతో గెలిచింది విండీస్.
నేడు టీ20 వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో భారత్ ఆడనుంది.అయితే ఇప్పటికే భారత జట్టు అమెరికాలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు.కాగా టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీతన కుటుంబంతో నిన్న అమెరికా చేరుకున్నాడు.ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టీ20 ప్రపంచకప్ గెలవాలనే ఉద్దేశంతో వెస్టిండీస్ చేరుకున్న ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వార్మప్ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ భారీ తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ 4 వికెట్లకు 257 పరుగులు చేసింది.బ్యాటింగ్ దిగిన ఆసీస్ 222 పరుగులు చేసింది.