Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులు వచ్చేశాయ్..
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త. త్వరలో రెండు రాష్ట్ర విద్యార్థులకు ఈ తేదీల నుంచి వేసవి సెలవులు ప్రకటించే అవకాశముంది. అ తేదీలు ఏంటో తెలుసుకోండి!
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త. త్వరలో రెండు రాష్ట్ర విద్యార్థులకు ఈ తేదీల నుంచి వేసవి సెలవులు ప్రకటించే అవకాశముంది. అ తేదీలు ఏంటో తెలుసుకోండి!
వేసవి సెలవులు రానున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా వచ్చే మూడు నెలలు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రకటించారు.
ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను రెండు నెలల పాటు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాచిగూడతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ఎనిమిది రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది.
వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే 32 ప్రత్యేక రైలు సర్వీసులను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిర్ణయించిన తేదీల్లో ఈ సర్వీసులను నడుపుతున్నట్లు అధికారులు వివరించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు రోజురోజుకి పెరుగుతుండడంతో పాఠశాలలకు ముందుగానే సెలవులు ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సెలవులకు ఊర్లు వెళ్లేవారు చాలా మంది టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో రెండు నెలల ముందే ట్రైన్లన్ని ఫుల్ అయిపోయాయని రైల్వే శాఖాధికారులు వెల్లడించారు.