TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త... వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు! వేసవి సెలవులు రానున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా వచ్చే మూడు నెలలు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రకటించారు. By Bhavana 05 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Tirumala : వేసవి సెలవులు(Summer Holidays) రానున్న నేపథ్యంలో టీటీడీ(TTD) అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా వచ్చే మూడు నెలలు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు(VIP Break Darshan) రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి(AV Dharma Reddy) వివరించారు. టీటీడీ పరిపాలనా భవనం సమావేశం హాల్లో శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన వేళలు కల్పించడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. సిఫార్సు లేఖలపై వీఐపీ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, బయట లైన్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదం, మజ్జిగ, స్నాక్స్ , వైద్య సదుపాయాలు అన్ని వేళలా కొనసాగిస్తామని వివరించారు. మాడ వీధులు, నారాయణగిరి గార్డెన్స్ వెంబడి కూల్ పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్ పాయింట్లు నెలకొల్పుతున్నామని పేర్కొన్నారు. వేసవి రద్దీ సమయంలో భక్తులకు సహాయం అందించేందుకు స్కౌట్స్, గైడ్స్‌తో పాటు 2500 మంది శ్రీవారి సేవకులను నియమించామని తెలిపారు. #summer-holidays #darshan #vip #ttd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి