ఆంధ్రప్రదేశ్ Srisailam: కార్తీకమాసం సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. అధికారుల కీలక ప్రకటన! శ్రీశైలంలో కార్తీక మాస రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సోమవారాలతో పాటు ప్రత్యేక రోజులలో స్వామి వారి స్పర్శ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. By Bhavana 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలంలో చిరుత పులి సంచారం.. భయాందోళనలో భక్తులు.. శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. శ్రీశైల క్షేత్రం సమీపంలోని పాలధార-పంచదార వద్ద చిరుతపులి సంచరించింది. పాలధార పంచదార వద్ద ఉన్న రక్షణ గోడపై చిరుత పులి కూర్చొని ఉంది. అయితే, శ్రీశైల క్షేత్రానికి కారులో వెళ్తున్న భక్తులు ఆ చిరుతను గుర్తించారు. By Shiva.K 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల్లో నష్టం ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్య క్సేత్రం అయిన శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో అర్థరాత్రి సమయంలో ఎల్ బ్లాక్ సముదాయంలో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 15 షాపులు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు వెంటనే.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని, ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. By E. Chinni 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: హమ్మయ్యా.. మొత్తానికి శ్రీశైలంలో బోనులో చిక్కిన ఎలుగుబంటి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం పరిధిలోని శిఖరేశ్వరం సమీపంలో భక్తులను పరుగులు పెట్టించిన ఎలుగుబంటి ఎట్టకేలకు బోనులో చిక్కింది. శిఖరేశ్వరం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగు బంటిని అటవీ శాఖ అధికారులు శుక్రవారం తెల్లవారు జామున పట్టుకున్నారు. కొద్ది రోజులుగా శిఖరం ఆలయం పరిసరాల్లో ఎలుగు బంటి సంచరిస్తూ హల్చల్ చేస్తూ భక్తులను హడలెత్తించింది. దీంతో అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అలెన్, రేంజర్ నరసింహులు 3 ప్రత్యేక బోనులు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇవాళ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎలుగుబంటి ఎట్టకేలకు బోనులో చిక్కింది. అయితే చిక్కిన ఎలుగుబంటిని ఆత్మకూరు సమీపంలోని వెలుగోడుకు తరలించారు అధికారులు. ఎలుగు బంటిని వెలుగోడు సమీపంలోని సూదం అటవీ ప్రాంతంలో వదలనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn