IND vs SA: షాకిచ్చిన సఫారీలు.. రెండో వన్డేలో చిత్తయిన టీమిండియా
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారతజట్టు 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. భారత్ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఛేదించింది. టోనీ జోర్జీ (119) అజేయ శతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.