TG Teachers: పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్ల తొలగింపుపై హరీష్ రావు ఫైర్.. ఉపాధ్యాయ దినోత్సవ కానుక అంటూ
గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 6200 మంది పార్ట్‌టైం లెక్చరర్, టీచర్లను తొలగించడాన్ని దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు హరీష్ రావు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.