Health Tips : రాత్రిపూట నోరు తెరిచి నిద్రపోతున్నారా? అయితే మీ పని ఫసక్...!!
రాత్రిపూట నోరు తెరిచి నిద్రపోయేవారు చాలా సమస్యలను ఎదుర్కొంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మీరు నోటి ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు, గాలి ఫిల్టర్ చేయకుండా నేరుగా లోపలికి వెళుతుంది. ఫలితంగా నోటికి హాని కలిగించడమే కాకుండా, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహానికి దారి తీస్తుంది.