SLBC టన్నెల్ రూట్ మ్యాప్ ఇదే | SLBC Tunnel History | CM Revanth Reddy | Nagarkurnool | RTV
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్,హైడ్రా ,సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు.సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో ఆటంకం ఏర్పడుతుంది.
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆర్మీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నుంచి 23 మందితో కూడుకున్న టీం సంఘటనా స్థలానికి చేరుకుంది. కార్మికులను రక్షించేందుకు వారు పలు రకాల ప్లాన్లు వేస్తున్నారు.
శనివారం ఉదయం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అందులో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.