Y S Sharmila: పార్టీ నాయకుడి మృతితో తల్లడిల్లిన షర్మిల.. భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు..
వైఎస్సార్ తెలంగాణ పార్టీకి చెందిన నాయకుడు అమన్ మృతితో షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మేకల కుంట గ్రామంలో పార్టీ యువనేత అమన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల.. అమన్ కుటుంబ సభ్యులను ఓదార్చి, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయం కింద అమన్ కుటుంబానికి షర్మిల 3లక్షలు అందజేశారు.