BREAKING: జగన్ తో ముగిసిన షర్మిల భేటీ..!
సీఎం జగన్ తో షర్మిల భేటీ ముగిసింది. కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వాన పత్రిక అందించింది వైయస్ షర్మిల. రాత్రి 8 గంటల ఫ్లైట్ కు షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు.
సీఎం జగన్ తో షర్మిల భేటీ ముగిసింది. కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వాన పత్రిక అందించింది వైయస్ షర్మిల. రాత్రి 8 గంటల ఫ్లైట్ కు షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఇటీవల కాలుకు శస్త్రచికత్స జరగడంతో హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ రేపు పరామర్శించనున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరనున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు ను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కలిసిన డీకే శివకుమార్.. పక్కకు తీసుకెళ్లి మరీ చర్చలు జరిపారు. దీంతో వీరి భేటీ ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనియాంశమైంది. ఇండియా కూటమిలోకి చంద్రబాబును తీసుకెళ్లడానికి డీకే ప్రయత్నిస్తున్నాడంటూ టాక్ కు కారణమైంది.
వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె కొద్దిరోజుల్లో సోనియాగాంధీతో సమావేశం కానున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు షర్మిలను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా నియమించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుందని అన్నారు ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ గిడుగు రుద్రరాజు. త్వరలో ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల రాబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీలో షర్మిలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అన్నారు.
సీఎం కేసీఆర్ పై షర్మిల మరోసారి విమర్శల దాడికి దిగారు. స్వయానా ముఖ్యమంత్రికి గుంట భూమి ఎక్కువొచ్చిందంటే ఇక సామాన్యుల సంగతి దేవుడెరుగు అని అన్నారు. ఉన్నోళ్లకు లేనట్టుగా, లేనోళ్లకు ఉన్నట్టుగా, సర్వే నెంబర్ల దాకా మార్చి చూపించే మాయాజాలమే ధరణి అని ఎద్దేవా చేశారు.
ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా మిగిలిన పార్టీల వారిని తెలంగాణ ద్రోహులని కేసీఆర్ నిందిస్తున్నారని..ఇదేం లాజికో తనకు అర్థంకావడం లేదన్నారు YSRTP చీఫ్ షర్మిల. కేసీఆర్కు గట్స్ ఉంటే.. దమ్ముంటే.. ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు.
సీఎం కేసీఆర్పై మరోసారి విమర్శల వర్షం కురిపించారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడం గురించి ఆమె ట్విట్టర్ వేదికగా కేసీఆర్ను ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ అవినీతి బయటపడిందని.. తిన్నదంతా కక్కించే దాకా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అంటూ ఫైర్ అయ్యారు.
షర్మిల పార్టీ YSRTPకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. బైనాక్యులర్ గుర్తును ఫిక్స్ చేసింది. 119 నియోజకవర్గాల్లో ఒకే గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని షర్మిల ఇప్పటికే ప్రకటించారు.