Medaram: గద్దెనెక్కిన సారలమ్మ.. రేపు చిలుకలగుట్ట నుంచి తరలిరానున్న సమ్మక్క!
కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ బుధవారం తెల్లవారు జామున గద్దెకు చేరుకుంది. దీంతో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. వడ్డెలు ప్రత్యేక పూజలు చేశారు. జాతర రెండవ రోజు గురువారం సమ్మక్కను గద్దెల మీదకు తీసుకురావడంతో అపూర్వ ఘట్టం ప్రారంభమవుతుంది.