Love story:ప్రేమ గెలిచింది...భారత్ లోకి అడుగు పెట్టిన పాక్ యువతి జవేరియా
ఎట్టకేలకు వాళ్ళిద్దరూ కలిసారు. దేశాల సరిహద్దులను చెరిపేసి ఒక్కటవబోతున్నారు. ఐదేళ్ళ నిరీక్షణ ఫలించి కోలకత్తాకు చెందిన సమీర్ ఖాన్...పాకిస్తాన్ యువతి జవేరియా పెళ్ళి చేసుకోబోతున్నారు. నిన్న ఇండియాకి వచ్చిన జవేరియా పెళ్ళి ముహూర్తం కోసం ఆరాటంగా ఎదురు చూస్తోంది.