Chandrayaan-3: బ్రిక్స్ సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ప్రధాని మోదీ..!!
ఆగస్టు 23, 2023 గురువారం సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు భారత్ సరికొత్తచరిత్ర సృష్టించింది. దక్షిణ ధృవం వద్ద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ అవతరించింది. ఈ ఘనతపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సహా పలువురు ప్రపంచ నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ..చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ గా నిలిచారు.