మాజీ ప్రధాని కన్నుమూత.. గుండెపోటు రావడంతో..
చైనా మాజీ ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ (68) గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు చైనా అధికారిక మీడియా శుక్రవారం ఉదయం ప్రకటించింది.లీ దాదాపు పదేళ్ల పాటు ప్రధాన మంత్రిగా పని చేసి విశేష సేవలు అందించారు. గురువారం లీ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు.