RS Praveen Kumar: బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా.. బీఆర్ఎస్లో చేరిక
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి మాయావతికి పంపించారు. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్లో చేరనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.