Floods: కొండచరియలు విరిగిపడి నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు..60 మంది గల్లంతు!
నేపాల్ లో శుక్రవారం ఉదయం వరదల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.