Revanth Reddy: కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా.. ఫలితాలపై రేవంత్ రెడ్డి ట్వీట్
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావోద్వేగ స్వరంతో స్పందించారు. కొడంగల్ ప్రజలు ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తున ఎగరేశారని ట్వీట్ చేశారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావోద్వేగ స్వరంతో స్పందించారు. కొడంగల్ ప్రజలు ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తున ఎగరేశారని ట్వీట్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ విజయం దాదాపు ఖరారైంది. దీంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారంపై స్పందించిన కోమటిరెడ్డి, డీకే శివకుమార్ లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత తదుపరి కార్యాచరణను కేంద్ర అధినాయకత్వం నిర్ణయం మేరకు తీసుకుంటామని తెలిపారు.
పార్టీ కోసం కష్టపడ్డ రేవంత్ రెడ్డి తమ సీఎం అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన ప్రకటన చేశారు. మరో వైపు డీజీపీ అంజనీ కుమార్ తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు రేవంత్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఖమ్మం - పువ్వాడ అజయ్, పాలకుర్తి-ఎర్రబెల్లి దయాకర్ రావు, నిర్మల్-ఇంద్రకరణ్ రెడ్డి, బాల్కొండ-వేముల ప్రశాంత్ రెడ్డి, ధర్మపురి - కొప్పుల ఈశ్వర్, మహబూబ్నగర్ - శ్రీనివాస్ గౌడ్, వనపర్తి - నిరంజన్ రెడ్డి ఓటమి దిశలో ఉన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ 3వ స్థానంలో ఉన్నారు.
హోరాహోరీగా సాగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఆ పార్టీ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి రెండు సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. అయితే.. కామారెడ్డిలో కేసీఆర్ మూడో స్థానంలో ఉన్నారు.
సోషల్ మీడియాలో #RevanthReddy ట్రెండ్ అవుతోంది. మరో వైపు రేవంత్ అభిమానులు ఆయన ఇంటికి చేరుకుని సంబరాలు స్టార్ట్ చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట భద్రతను పెంచారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఆ పార్టీ 65-70 సీట్లు సాధించడం ఖాయం కానుంది. ఈ రోజు సాయంత్రానికి గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు హస్తం పార్టీ.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దుమ్మురేపింది. 65సీట్లతో కాంగ్రెస్ విజయం సాధించింది. కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇక కాంగ్రెస్ సీఎం రేపే ప్రమాణస్వీకారం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ప్రముఖ జ్యోతిష్యుడు నమిలికొండ రమణ చార్యులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈసారి రేవంత్ రెడ్డికి గ్రహాబలం ఉనప్పటికీ కేసీఆర్ కే రాజయోగం ఉందని చెప్పారు. మరో మూడేళ్ల 6 నెలలు కేసీఆర్ సీఎంగా ఉంటారన్నారు.