Revanth Reddy: హైదరాబాద్ చేరుకున్న రేవంత్.. రేపు ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రులు వీళ్లే!
సీఎంగా పేరు ప్రకటన తర్వాత నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ కు తిరిగివచ్చారు. అధిష్టానంతో చర్చల తర్వాత మంత్రుల జాబితాతో ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. రేపు రేవంత్ తో పాటు మొత్తం ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.