KTR: మీకు సిగ్గుందా?.. సీఎం రేవంత్‌పై KTR ఫైర్!
TG: హమీల అమలుకు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారని వారిపై పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు కేటీఆర్. మహిళలపై మగ పోలీసులతో దాడి చేయించడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? అని మండిపడ్డారు.
TG: హమీల అమలుకు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారని వారిపై పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు కేటీఆర్. మహిళలపై మగ పోలీసులతో దాడి చేయించడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? అని మండిపడ్డారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటూ ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలను జరపాలని నిర్ణయించింది. దీన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జరుపుకోవాలని తెలిపింది.
హైదరాబాద్‌లోని కోఠిలో ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేయడంపై హరీశ్ రావు స్పందించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచుతామని చెప్పి ఇప్పుడు పోలీసులతో కొట్టించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆశాల ఆశలపై నీళ్లు చల్లుతుండటం సిగ్గుచేటు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లుకు సంబంధించి మొబైల్ యాప్ ఆవిష్కరించటంతో పాటు 3 ఇంటి నమూనాలు విడుదల చేసింది. ప్రభుత్వం ఇచ్చే 400 చదరపు అడుగుల డిజైన్ ను అనుసరించాల్సిన పని లేదు. ఇంకా స్థలం ఉంటే 500 చదరపు అడుగుల్లోనూ ఇల్లు కట్టుకోవచ్చు.
సంక్రాంతి తర్వాత రైతుభరోసా నిధులను విడుదల చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అయితే.. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయ పన్ను కట్టే వారికి రైతు భరోసాను కట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా.. ఐదు లేదా పది ఎకరాలకు సీలింగ్ విధించే ఛాన్స్ ఉంది.