Savings Account: బేసిక్ సేవింగ్స్ ఎకౌంట్.. మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు.. వివరాలివే
ఎకౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడం కష్టంగా ఉండే వారి కోసం ఆర్బీఐ కొత్త సేవింగ్స్ ఎకౌంట్ BSBDA అంటే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఎకౌంట్ తీసుకువచ్చింది
ఎకౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడం కష్టంగా ఉండే వారి కోసం ఆర్బీఐ కొత్త సేవింగ్స్ ఎకౌంట్ BSBDA అంటే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఎకౌంట్ తీసుకువచ్చింది
2000 నోటును రద్దు చేసిన ఆర్బీఐ.. ఇప్పుడు మళ్లీ రూ. 1000 నోట్లను వినియోగంలోకి తీసుకువస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ఇప్పుడు సోషల్ మీడియా లోకం కోడై కూస్తోంది. రూ. 2000 నోటు రద్దు వెనుక కారణం ఇదేనంటూ ఎవరికి తోచిన ప్రచారం వారు చేస్తున్నారు. ఆర్బీఐ కూడా ఇదే హింట్స్ ఇస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ వరుస పుకార్లతో సామాన్య ప్రజలు మళ్లీ కన్ఫ్యూజన్లో పడిపోయారు.
కేంద్రం పెద్ద నోట్లను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో.. మళ్లీ పాత పెద్ద నోట్లు చలామణిలోకి వస్తాయానే వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే దీనిపై కేంద్ర బ్యాంకైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. మళ్లీ వెయ్యి రూపాయల నోట్లను ప్రవేశపెట్టే అవకాశాలు లేవని.. సోర్సెస్‌ను ఉటంకిస్తూ ఏఎన్ఐ రిపోర్టు చేసింది. మరోవైపు ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనలు తమ వద్ద ఏమి లేవని గతంలోనే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ క్లారిటీ ఇచ్చారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 1000 రూపాయల నోట్లను మళ్లీ విడుదల చేస్తుందా? నోట్ల రద్దు సమయంలో వెయ్యి రూపాయల నోటును శాశ్వతంగా రద్దుచేసింది. ఆ స్థానంలో 2వేల నోటును తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ 2వేల నోటును కూడా రద్దు చేసింది ఇప్పుడు కొత్తగా ఓ ప్రచారం షురూ అయ్యింది. RBI మళ్లీ రూ. 1000 నోటును విడుదల చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కొన్ని రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందుకు ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లపై భారీ జరిమానా విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మంగళవారం తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్‌పై రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రూ.3.95 కోట్లు ఆర్బీఐ జరిమానా విధించింది. రెగ్యులేటరీ సమ్మతి లోపాలను బట్టి రెండు కేసుల్లో జరిమానాలు విధించినట్లు RBI పేర్కొంది.
రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను ఉపక్రమిస్తున్న బ్యాంకులకు ఆర్బీఐ చుక్కలు చూపిస్తోంది. లైసెన్స్‌లు రద్దు చేయడం, భారీగా జరిమాన విధించడం లాంటివి చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో నాలుగు బ్యాంకులపై జరిమాన విధించింది. ఇప్పటికే చాలావరకు కో-ఆపరేటివ్ బ్యాంకులు ఆర్బీఐ మార్గదర్శలకు పెడచెవిన పెట్టాయి. అందుకోసమే ఆర్బీఐ ఈ విషయాల పట్ల సిరీయస్ అయింది. అందుకే లైసెన్స్ రద్దు చేయడం లేదా భారీ జరిమానాలు విధించడం లాంటివి చేస్తోంది.
బంగారంపై లోన్ తీసుకునేవారికి ఆర్బీఐ శుభవార్త చెప్పింది. బుల్లెట్ గోల్డ్ రీపేమెంట్ లోన్ నిబంధనలను మార్చింది. బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ స్కీం కింద బంగారంపై రుణాన్ని ఆర్బీఐ రెండింతులు చేసి రూ. 4లక్షలు పెంచింది. రుణగ్రహీత ఏడాది చివరిలో మొత్తం అసలు, వడ్డీ మొత్తాన్ని చెల్లించిన తర్వాత, రుణ పరిమితి గడువు ముగుస్తుంది. మరింత సులభంగా చెప్పాలంటే,,రుణగ్రహీత రుణాన్ని చెల్లించిన మరుసటి రోజే మళ్లీ లోన్ తీసుకోవచ్చు.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ 13న 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ దరఖాస్తు ప్రక్రియ బుధవారం, అక్టోబర్ 4, 2023తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు చివరి క్షణాల కోసం వేచి ఉండకుండా వీలైనంత త్వరగా తమ దరఖాస్తులను సమర్పించాలి.