కొత్త ఫ్రెండ్ ను పరిచయం చేసిన మెగా పవర్ స్టార్..!!
బ్లేజ్.. నా కొత్త ఫ్రెండ్ అంటూ ఓ మేలుజాతి గుర్రం ఫొటోను టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పంచుకున్నారు. ఆ అశ్వం పక్కనే రామ్ చరణ్ నిలుచుని ప్రేమగా దాన్ని నిమురుతున్న పోటోను షేర్ చేశాడు.
బ్లేజ్.. నా కొత్త ఫ్రెండ్ అంటూ ఓ మేలుజాతి గుర్రం ఫొటోను టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పంచుకున్నారు. ఆ అశ్వం పక్కనే రామ్ చరణ్ నిలుచుని ప్రేమగా దాన్ని నిమురుతున్న పోటోను షేర్ చేశాడు.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ను చాలా కాలం కిందటే ప్రకటించాగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నట్లు ఫిలిమ్ మేకర్స్ తెలిపారు.
తన సినిమా ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ అనుష్క, 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రెసిపీ ఛాలెంజ్ ప్రారంభించింది. అనుష్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఈ ఛాలెంజ్ ఇవ్వగా..ఆయన స్వీకరించి తనకు ప్రాన్స్ పలావ్ ఇష్టమని చెబుతూ ఎలా తయారు చేయాలో వివరించారు. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్‌ను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు ఫార్వార్డ్ చేశాడు ప్రభాస్.
ఓ వైపు జాతీయ అవార్డ్ వచ్చిందనే ఆనందం. మరోవైపు శుభాకాంక్షలు సరిగ్గా చెప్పలేదనే ఆక్రోషం. వెరసి మెగా కాంపౌండ్ ఇప్పుడు భగ్గుమంటోంది. ఫ్యాన్స్ లో సెలబ్రేషన్ చేసుకునేవాళ్లు చేసుకుంటున్నారు, మరోవైపు రగిలిపోయే బ్యాచ్ కూడా అదే స్థాయిలో ఉంది. ఇంతకూ ఏం జరిగింది?
రామ్ చరణ్-ఉపాసన కూతురు క్లింకారకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. క్లింకార ముఖం పూర్తిగా కనిపించకున్నా ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అవుతున్నారు. తన చిట్టి చేతులతో మువ్వన్నెల జెండా తాడును పట్టుకున్న క్లింకార ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు ఉపాసన. గత జూన్ 20న మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టింది క్లింకార.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ నుంచి మొదటి పాన్ ఇండియా హీరోగా చరిత్ర సృష్టించారు. అప్పటినుంచి డార్లింగ్ ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్లోనే విడుదలవుతున్నాయి. తాజాగా విడుదలైన 'కల్కి 2898 ఏడీ' చిత్రం గ్లింప్స్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.