PM Narendra Modi: నేడు హైదరాబాద్ లో మోదీ మీటింగ్.. ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
మంగళవారం నాడు ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు.ఈ క్రమంలో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మంగళవారం నాడు ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు.ఈ క్రమంలో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి మాట్లాడుతున్నారా లేక తన బావ చంద్రబాబు ఉనికిని కాపాడాటానికి ఆమె మాట్లాడుతున్నారా అంటూ బాపట్ల ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు ప్రశ్నించారు.
తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, తనకు ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతానని ఈ విషయం పై మరోసారి మీడియా ఇలా ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తే న్యాయ విచారణకు సిద్ధంగా ఉండాలని డీకే అరుణ హెచ్చరించారు.
హైదరాబాద్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు కేఎల్ఆర్, పారిజాత నర్సింహారెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.
బీఆర్ఎస్ దుర్మార్గాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు, బీజేపీ వైపు నిలబడాలని ఇంకొందరు అంటున్నారు.ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాల్లో సాధ్యపడదు. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలమని బీజేపీ నేత, నటి విజయశాంతి అభిప్రాయపడ్డారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకు పంపించాలని పట్టుబట్టారు రఘురామ కృష్ణంరాజు . జగన్ కేసుల విచారణలో తీవ్రజాప్యం జరుగుతోందని సుప్రీంకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ అన్నారు. వివేక్ వెంకటస్వామి బీజేపీలోనే కొనసాగుతున్నారని..ఆయన మీద చేస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు.
బాధ్యత కలిగిన వ్యక్తిగా ఎమ్మెల్యే వివేకానంద్ తనపై దాడి చేసిన సమయంలో సంయమనం పాటించానని బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ప్రజలు ప్రశ్నించడంతోనే ఎమ్మెల్యే ఫస్ట్రేషన్ కు గురవుతున్నాడంటూ ధ్వజమెత్తారు. ఈ సారి తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు అనారోగ్యానికి గురయ్యారు.గత కొన్ని రోజులుగా ఆయన కడుపులో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ని సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో చేర్పించారు.