YouTube : నెమలి కూర వండి వీడియో అప్లోడ్ చేశాడు.. చివరికి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి యూట్యూబ్లో నెమలి కూర వండిన వీడియో అప్లోడ్ చేశాడు. నెమలి జాతీయ పక్షి కావడంతో అటవీశాఖ అధికారులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.