AP: జనసేనకు పోతిన మహేష్ గుడ్‌బై
జనసేన పార్టీలో అతి ముఖ్యమైన నేతగా ఉన్న పోతిన మహేష్ ఈరోజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తన రాజీనామా లేఖను అధినేత పవన్ కల్యాణ్‌కు పంపించారు. ఆశించిన టికెట్ రాకపోవడంతోనే మహేష్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
జనసేన పార్టీలో అతి ముఖ్యమైన నేతగా ఉన్న పోతిన మహేష్ ఈరోజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తన రాజీనామా లేఖను అధినేత పవన్ కల్యాణ్‌కు పంపించారు. ఆశించిన టికెట్ రాకపోవడంతోనే మహేష్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
పాలకొండ నియోజకవర్గానికి చెందిన పడాల భూదేవి ఈ రోజు జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో ఆమెకు జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ పాలకొండలో జనసేన జెండా ఎగరవేస్తామని అన్నారు.
అనకాపల్లి పర్యటనలో సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. అమ్మఒడి పథకం కింద అమ్మలకు రూ.19,600 కోట్లు ఇచ్చి.. మద్యం మీద నాన్నల దగ్గరి నుంచి లక్ష కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. జగన్ ముఖ్యమంత్రి కాదు..మద్యం వ్యాపారిలా మారారని ఎద్దేవా చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు అనకాపల్లిలో ప్రచారం నిర్వహించనున్నారు. అనకాపల్లి నెహ్రు చౌక్ దగ్గర వారాహి విజయభేరి సభలో ఆయన పాల్గొంటారు. దీంతో ఆయన ఏం మాట్లాడుతారు? వైసీపీపై ఎలాంటి విమర్శలు చేస్తారు అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో తన గెలుపు ఖాయమని వైసీపీ అభ్యర్థి వంగా గీతా ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీవీతో ఆమె మాట్లాడుతూ.. జనం కోసం జగన్ ఉంటే.. రాజకీయాలు చేస్తోంది మాత్రం ప్రతిపక్షాలు అని ఫైర్ అయ్యారు.
బాలీవుడ్ నటి ముంతాజ్ గురించి తెలుగు వారికి పరిచయం అక్కర్లేదు. ఖుషి, అత్తారింటికి దారేది సినిమాలో ఐటమ్ సాంగ్స్ చేసి శృంగార తారగా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఆమె సినిమాలనుంచి దూరం అయ్యింది. అయితే అందుకు గల కారణాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. వివరాల కోసం ఆర్టికల్ చదివేయండి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 7 నుంచి మళ్లీ ప్రచార బరిలోకి దిగనున్నారు. వారాహి విజయభేరి యాత్రను మళ్లీ కొనసాగించనున్నారు. ఇటీవల తీవ్ర జ్వరం కారణంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ఆపుకుని పవన్ హైదరాబాద్ వెళ్లిన సంగతి తెలిసిందే.
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తూ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును ఫైనల్ చేశారు. స్థానికంగా యనమల భాస్కర్ రావుపై వ్యతిరేకత ఉండడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.