Parliament session:రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, చర్చ.
పార్లమెంటు సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
పార్లమెంటు సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహిళా బిల్లుపై బీజేపీకి ఉన్న చిత్తశుద్దికి ఇది నిదర్శనమన్నారు.
బీఆర్ఎస్పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటిస్తున్న సమయంలో పార్లమెంట్లో కేసీఆర్ లేడని, ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తున్న సమయంలో కవిత ఎంపీగా లేరన్న ఆయనా.. అయినా ఆ క్రెడిట్ అంతా తమదే అనే విధంగా చెప్పుకోవాలని చూస్తున్నారన్నారు.
కొత్త పార్లమెంటు భవనంలో లోక్ సభతో పాటూ ఈరోజు రాజ్యసభ కూడా కొలువు తీరింది. రానున్న రోజుల్లో భారత్ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారబోతోందని...దానికి కొత్త పార్లమెంట్ సాక్ష్యంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
నూతన పార్లమెంటు భవనంలో జరిగిన మొదటి లోక్ సభ సమావేశంలో మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. దాదాపు 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అయితే ఈ బిల్లు అమల్లోకి రావలంటే మాత్రం 2027 వరకు ఆగాల్సిందే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దానికి సంబంధించిన వివరాలు...
పాత పార్లమెంట్ లో ప్రధాని మోదీ చివరి సారి ప్రసంగించారు. ఎంపీలందరినీ ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఈ పార్లమెంట్ రెండూ మనకు సంకల్పాన్ని ఇస్తాయని, స్ఫూర్తిని ఇస్తాయని అన్నారు. పార్లమెంటు ద్వారా ఆర్టికల్ 370 నుండి స్వేచ్ఛ పొందారు. ముస్లిం సోదరీమణులకు కూడా న్యాయం జరిగిందన్నారు. ప్రధాని మోదీ చివరి ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలేంటో చూద్దాం.
కొత్త భవనంలో తొలిసారి సమావేశాలు నిర్వహిస్తున్న వేళ అందులో పని చేసే ఉద్యోగుల డ్రెస్ కోడ్ (Dress Code) కూడా మార్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కొత్త యూనిఫామ్ ను రూపొందించినట్లు కూడా తెలుస్తుంది.
ప్రధాని మోడీపై(pm modi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi) నిప్పులు చెరిగారు. లోక్ సభలో ప్రధాని మోడీ నిన్న రెండు గంటల సుదీర్ఘ ప్రసంగం చేశారని తెలిపారు. కానీ మణిపూర్ పై ప్రధాని స్పందించిన తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందన్నారు
పార్లమెంట్ సాక్షి గా వెల్లడైన వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే.. షాక్ కి లోనవ్వడం ఖాయం. 2019వ సంవత్సరంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై 431 కేసులు నమోదు కాగా, 2020లో 602 కేసులు, 2021లో 1085 కేసుల నమోదయ్యాయి. అన్ స్టార్డ్ ప్రశ్నకు రాజ్యసభ పై గణాంకాలను వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్ మాదకద్రవ్యాల హబ్ గా మారిందని ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఈ గణాంకాలు బలం చేకూరుస్తున్నాయి. మరి దీనిపై జగన్ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.