Bhamakalapam2: ఓటీటీలో ఊపేసిన సినిమాకి సీక్వెల్ థియేటర్లలో..ప్రియమణి కూడా అదే రూటులో!
ప్రియమణి లీడ్ రోల్ లో నటించిన సినిమా భామాకలాపం. డార్క్ కామెడీ థ్రిల్లర్ గా అభిమన్యు దర్శకత్వంలో గతేడాది వచ్చిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రాబోతోంది. అయితే, ఇది నేరుగా థియేటర్లలో ముందుగా రిలీజ్ కాబోతోంది.