Onion Export: నిషేధం ఎత్తివేయడంతో ఉల్లి ఎగుమతులు మళ్లీ పెరిగాయి
ఉల్లిధరల పెరుగుదల అరికట్టడం కోసం గత డిసెంబర్ లో ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించారు. అయితే, రైతుల నిరసనలతో ఈ నెల మొదట్లో ఎగుమతులపై నిషేధాన్ని తొలగించారు. దీంతో మే నెలలో ఇప్పటి వరకూ 45,000 టన్నులకు పైగా ఉల్లిపాయలు మన దేశం నుంచి ఎగుమతి అయ్యాయి.