రాష్ట్రాన్ని గాడిలో పెడతాం.. వారిని వదిలిపెట్టం: లోకేష్
రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. కూటమిలోని పార్టీలన్నీ కలిసి నిర్ణయం తీసుకుంటాయన్నారు. మంగళగిరిలో తాను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నానన్నారు.
రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. కూటమిలోని పార్టీలన్నీ కలిసి నిర్ణయం తీసుకుంటాయన్నారు. మంగళగిరిలో తాను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నానన్నారు.
చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం లేదని తెలుస్తోంది. రేపు ఎన్డీయే కూటమి పక్షాలతో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలోనే రేపు చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
నేటి ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయంపై జగన్ స్పందించారు. ఇలాంటి ఫలితాలు ఊహించలేదన్నారు. కోట్లాది మందికి లబ్ధి చేశామని.. వారందరి ఓట్లు ఎక్కడికి వెళ్లాయో అర్థం కావడం లేదన్నారు. గుండె ధైర్యంతో మళ్లీ పైకి లేస్తాం అన్నారు. ఎన్నికష్టాలు పెట్టినా ఎదుర్కొంటామన్నారు.
రాష్ట్రానికి మూడు రాజధానులు చేస్తామంటూ ప్రకటనలు చేసిన వైసీపీని అదే అంశం ముంచినట్లు ప్రస్తుత ఎన్నికల ఫలితాలను విశ్లేస్తే అర్థం అవుతోంది. ఏపీని రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారంటూ ప్రతిపక్షాలకు చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లినట్లు అర్థం అవుతోంది.
దేశంలో మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాబోతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బీసీలు, ఎస్సీలకు అన్యాయం చేశాడన్నారు. ఆ ప్రతిఫలం రేపు ఫలితాల్లో కనిపిస్తుందన్నారు. మందకృష్ణ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
తిరుపతి ఎంపీ సీటులో ఆర్టీవీ నిర్వహించిన ప్రీపోల్ స్టడీలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గెలిచే అవకాశం ఉందని స్పష్టమైంది. కానీ ఎన్నికల నాటికి పరిస్థితి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కు అనుకూలంగా మారిందన్నారు రవిప్రకాష్. ఆయన పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో చూడండి.
తెలంగాణలో కాంగ్రెస్ కే అత్యధిక సీట్లు వస్తాయని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ లో కడియం కావ్య గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీవీకి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
పోలింగ్ సందర్భంగా రణరంగంగా మారిన తాడిపత్రిపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. రేపు కౌంటింగ్ సందర్భంగా హింస తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెచ్చగొట్టినా, హింసకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.