Viral Photo: ప్రధాని మోదీతో చంద్రబాబు ఫ్యామిలీ
ఈ రోజు కేసరపల్లిలో జరిగిన చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు, ప్రధానితో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ రోజు కేసరపల్లిలో జరిగిన చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు, ప్రధానితో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో సమావేశం అయ్యారు. ప్రభుత్వ లక్ష్యాలను ఈ సందర్భంగా చంద్రబాబు వారికి వివరించారు. మరికొద్ది సేపట్లో మంత్రులకు శాఖలను కేటాయించే అవకాశం ఉంది.
ఈ రోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎంగా తొలి సంతకం మెగా డీఎస్సీపై ఆయన చేయనున్నారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేయనున్నారు.
పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కడం ఖాయమని స్పష్టం అవుతోంది. చంద్రబాబు, పవన్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసిన చిరంజీవి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పవన్ ను డిప్యూటీ సీఎంగా సంబోధించారు. దీంతో వారు పక్కా సమాచారంతోనే ఇలా ట్వీట్ చేశారని పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఏపీలో ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు, యువత ఆంకాక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, మంత్రులకు 'X' ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ టెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. పేపర్ 1 పరీక్షకు మొత్తం 85,996 మంది హాజరుకాగా.. 57,725 మంది అర్హత సాధించారు. అభ్యర్థులు https://tstet2024.aptonline.in వెబ్ సైట్లో తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఈరోజు (జూన్ 12) రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న(జూన్ 11) రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. గురువారం కూడా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
యాక్సిడెంట్ ఓ ఫ్యామిలీని కాపాడింది. చిన్నారితో పాటు రోడ్డు దాటుతున్న భార్యాభర్తలపైకి దూసుకొచ్చిన కారును మరో కారు ఢీ కొట్టింది. దీంతో ఆ కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.