SUPER 50 News: 10 నిమిషాలు.. 50 వార్తలు!
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతల స్వీకరణ, ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ, ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, తిరుమలలో భక్తుల రద్దీతో పాటు నేటి టాప్ 50 వార్తలను ఈ వీడియోలో తెలుసుకోండి.
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతల స్వీకరణ, ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ, ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, తిరుమలలో భక్తుల రద్దీతో పాటు నేటి టాప్ 50 వార్తలను ఈ వీడియోలో తెలుసుకోండి.
కేజీహెచ్ లో కన్నీరు పెట్టించే ఘటన చోటు చేసుకుంది. నెలలు నిండకముందే పుట్టిన ఓ పసికందును ఎన్ఐసీయూకు తరలించాల్సి రాగా.. సిబ్బంది లేకపోవడంతో తండ్రి సిలిండర్ మోయాల్సి వచ్చింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి ఫ్యాక్షన్ విభేదాలు భగ్గుమన్నాయి. ఏవీ సుబ్బారెడ్డికి చెందిన ఏవీ ప్లాజాపై భూమా అఖిలప్రియ అనుచరులు రాళ్లదాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రాళ్లదాడిలో బార్ అండ్ రెస్టారెంట్ అద్దాలు పగిలిపోయాయి.
ఏపీ అడ్వకేట్ జనరల్ గా ప్రముఖ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ ను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం మారిన తర్వాత అడ్వకేట్ జనరల్, అదనప్ అడ్వకేట్ జనరల్ రాజీనామాలు చేశారు. ప్రస్తుతం నూతనంగా నియామకమైన దమ్మలపాటి శ్రీనివాస్ గత చంద్రబాబు హయంలోనూ ఏజీగా పని చేశారు.
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ ఫర్నాండేజ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు, తెలంగాణలో రైతు రుణ మాఫీ, పీఎం కిసాన్ నిధుల విడుదల, బంగారం ధరలు, టీమిండియా కొత్త కోచ్, యాదాద్రిలో గిరిప్రదక్షిణ, టీ20 వరల్డ్ కప్ తాజా వివరాలతో పాటు ఈ రోజు టాప్ 50 న్యూస్ అప్డేట్స్ ను ఈ వీడియోలో తెలుసుకోండి.
సచివాలయంలో తన ఛాంబర్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తొలిసారి తన ఛాంబర్ కు వచ్చిన పవన్ ను అలింగనం చేసుకుని ఘన స్వాగతం పలికారు చంద్రబాబు. పవన్ వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు.
మియాపూర్ నుండి పఠాన్ చెరు, సంగారెడ్డి వరకు మెట్రో రైల్ ను పొడిగించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీని కోరారు. ఈ రోజు సంగారెడ్డి బీజేపీ నేతలతో కలిసి మెట్రో రైల్ MDకి వినతి పత్రం అందించారు. గ్రౌండ్ రిపోర్ట్ ను వెంటనే తెప్పిస్తమని వారికి ఎండీ హామీ ఇచ్చారు.