GWMC: రసాభాసగా వరంగల్ కొర్పొరేషన్ మీటింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఫైట్!
ఈ రోజు జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. పార్టీ మారిన మేయర్ గుండు సుధారిణికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. వీరి ఆందోళన మధ్యే బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.