నేటి సూపర్-50 న్యూస్!
ముంబై వాంఖడే స్టేడియం వద్ద తొక్కిసలాట.. మితిమీరిన వేగానికి రోడ్డున పడుతున్న కుటుంబాలు.. బ్రిటన్ ఎన్నికల్లో ఇండియా అల్లుడికి ఘోర పరాభవం.. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఈ వీడియోలో సూపర్-50 న్యూస్ చూడండి!
ముంబై వాంఖడే స్టేడియం వద్ద తొక్కిసలాట.. మితిమీరిన వేగానికి రోడ్డున పడుతున్న కుటుంబాలు.. బ్రిటన్ ఎన్నికల్లో ఇండియా అల్లుడికి ఘోర పరాభవం.. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఈ వీడియోలో సూపర్-50 న్యూస్ చూడండి!
మండలిలో ఆధిక్యం సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీల చేరికలతో కాంగ్రెస్ బలం 12కు పెరగగా.. మరో 6 గురిని చేర్చుకుని మండలిలో మెజారిటీ సాధించాలన్నది రేవంత్ ప్లాన్ గా తెలుస్తోంది.
17 ఏళ్ల తర్వాత టీ-20 వరల్డ్కప్ అందుకున్న సందర్భంగా ముంబైలో టీమిండియా ఓపెన్ బస్ పరేడ్ నిర్వహిస్తున్నారు. ముంబై చేరుకున్న టీమ్ ఇండియాకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు సాగనున్న ఈ ఓపెన్ బస్ పరేడ్ కు భారీగా అభిమానులు తరలివచ్చారు.
మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తాను ఎలాంటి డేట్ చెప్పలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీతో భేటీ తర్వాత ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం అంశం ఇప్పుడు అనేది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షాను కలిశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కోరామన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర ప్రతినిధులు దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులు అర్పించారు.
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. రాజధాని, పోలవరం, కేంద్రం నిధులపై ప్రధానంగా ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మోదీ సైతం ఈ అంశాలపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి జీహెచ్ఎంసీ కమిషనర్ గా తన దైన శైలిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ రోజు నారాయణగూడలో స్వయంగా పర్యటించిన ఆమ్రపలి అధికారులకు పలు అంశాలపై ఆదేశాలు జారీ చేశారు.