తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ-LIVE
మరికొద్ది సేపట్లో హైదరాబాద్ బేగంపేటలోని ప్రజా భవన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్టేట్స్ ను ఈ వీడియోలో చూడండి.
మరికొద్ది సేపట్లో హైదరాబాద్ బేగంపేటలోని ప్రజా భవన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్టేట్స్ ను ఈ వీడియోలో చూడండి.
కాంగ్రెస్ పార్టీ తమతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెబుతోందని.. వారందరితో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ఆ సీట్లతో తామే గెలుస్తామన్నారు బండి సంజయ్. ఎన్నికలు రావన్న ధీమాతోనే రాజ్యసభ సభ్యత్వానికి కేకేతో రాజీనామా చేయించారన్నారు.
తెలంగాణ పేపర్ మర్చంట్ అసోసియేషన్ కార్యవర్గం ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ను సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. జులై 28న అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ బల్ద్వా ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో జరిగే సైకిల్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి శ్రీధర్ బాబుతో గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, గోపీనాథ్, కృష్ణారావు, వివేకానంద గౌడ్, రాజశేఖర్ రెడ్డి, అరిక పూడి గాంధీ భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే అని వారు చెబుతున్నా.. పార్టీ మారేందుకే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో చార్మినార్ పీఎస్ పరిధిలో అమిత్ షాపై నమోదైన కేసును తెలంగాణ పోలీసులు ఉపసంహరించుకున్నారు. ఆయన ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘించలేదన్న కారణంతో కేసు ఉపసంహరించుకున్నారు.
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ ఈ రోజు మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో వీరి కలయిక కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇటీవల బీఆర్ఎస్ ను వీడి సొంతగూడు కాంగ్రెస్ కు చేరిన సీనియర్ నేత కే కేశవరావు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. జడ్పీ చైర్మన్ల పదవీకాలం ఈ నెల 4తో ముగియడంతో.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజాపరిషత్ లకు ప్రత్యేక అధికారులను నియమించింది.