మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. భోళాశంకర్ విడుదలకు గ్రీన్ సిగ్నల్
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్. ఆగస్టు 11న భోళాశంకర్ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. గాయత్రి ఫిలిమ్స్ వేసిన పిటిషన్‌ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది.
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్. ఆగస్టు 11న భోళాశంకర్ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. గాయత్రి ఫిలిమ్స్ వేసిన పిటిషన్‌ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది.
ప్రభుత్వంపై విపక్షకూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో మూడు రోజుల పాటు చర్చ జరిగింది. ఓటింగ్‌కు ముందే విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి.
ప్రశాంతమైన విశాఖలో ప్రస్తుతం గుండాలు రాజ్యమేలుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. వారాహియాత్ర మూడో దశ ప్రారంభం సందర్భంగా విశాఖ వచ్చిన ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. పెద్దకూరపాడులో జరుగుతున్న పాదయాత్రలో వైసీపీ బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వంపై నిపులు చెరిగారు.
కేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పద బిల్లుకు రంగం సిద్ధం చేసింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి. కమిషనర్లను నియమించే సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మినహాయించే చట్టాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది.
కాంగ్రెస్ లో సికింద్రాబాద్ సీట్ లొల్లి.. మళ్లీ తానే పోటీ చేస్తానని అంజన్ కుమార్ యాదవ్ పట్టు..ఈ సారి సికింద్రాబాద్ స్థానం నుంచి బరిలోకి దిగుతానని పార్టీ అధిష్టానానికి చెప్పిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్.. సికింద్రాబాద్ యాదవులదే అంటున్న యాదవ సంఘాలు..
బెజవాడ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు వంగవీటి రాధా రెడీ ఐనట్టే కనిపిస్తోంది. ఇవాళ (ఆగస్టు 10) తన అనుచరులతో రాధా భేటీ కానున్నారు. ఈ మీటింగ్ తర్వాత రాధా రాజకీయ అడుగులు ఎటువైపన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాధా జనసేనలో చేరుతారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు నారా లోకేశ్ పాదాయాత్ర కోసమే ఈ మీటింగ్ అని మరో వాదన వినిపిస్తోంది. మరికొన్ని రోజుల్లోనే లోకేశ్ పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
కేరళ అసెంబ్లీ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్రం పేరును మార్చేందుకు ఉద్దేశించిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక నుంచి రాష్ట్రం పేరును ‘కేరళ’అని కాకుండా ‘కేరళం’గా పిలవాలని తీర్మానంలో పేర్కొంది. ఈ మేరకు మార్పులు చేయాలని కేంద్రానికి కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని పంపింది. రాజ్యాంగంలోని 3వ నిబంధన కింద పేరు మార్పుకు సంబధించి వెంటనే చర్యలు తీసుకోవాలని తీర్మానంలో కోరింది.
కాంగ్రెస్ ‘స్కామ్’ గ్రెస్ అయిపోయిందని.. ఇదే ఆ పార్టీ అసలైన రంగూ అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు. కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ అక్కడ అసలు రంగును బయటపెడుతోందని ఆయన ఫైర్ అయ్యారు. కర్ణాటక విజయోత్సవంతో జోష్ లో ఉన్న టీ కాంగ్రెస్ నేతలు తెంగాణలోనూ అక్కడి ఫలితాలను రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.