YSRTP: తెలంగాణ ఎన్నికలకు వైఎస్సార్టీపీ దూరం: షర్మిల సంచలన ప్రకటన
ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీకి దూరంగా ఉంటుందని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీకి దూరంగా ఉంటుందని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
వన్డే ప్రపంచకప్‌లో భారత్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. శ్రీలంకపై భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 302 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. శ్రీలంక 19 ఓవర్లకు 55 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా "డ్యూయెట్" ఈ సినిమాలో ఆనంద్ హీరోగా, రితిక హీరోయిన్ గా నటించనున్నారు. ఈరోజు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్థూడియోస్ లో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
అమెరికాలోని లాస్ వెగాస్ సిటీలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. నగ్నంగా రోడ్లపై తిరుగుతూ.. పోలీసులపైనే ఎదురు దాడి చేశాడు. ఆపై పోలీస్ పెట్రోలింగ్ కారును ఎత్తుకెళ్లాడు. వేగంగా దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
భూతనాథ సదానందాః సర్వభూత దయాపర రక్షరక్ష మహాబాహో.. శాస్తేతుభ్యం నమోనమః... పిలిస్తే పలికే కలియుగ వరదుడు, శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్పస్వామి కుంభాభిషేకం బుధవారం అత్యంత ఘనంగా ప్రారంభం అయ్యింది.
లిఫ్ట్‌లో కుక్కలకు అనుమతి లేదంటూ ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మహిళతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత గొడవ పెద్దదై ఇద్దరూ కొట్టుకున్నారు. మధ్యలో మహిళ భర్త ఎంట్రీ ఇచ్చి అధికారిపై దాడి చేశాడు. నోయిడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడు కొద్ది సేపటి క్రితం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ రోజు ఉదయం చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాను కష్టాల్లో ఉన్న సమయంలో మద్దతుగా నిలిచిన వారందరికీ చంద్రబాబు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
‘కన్నప్ప’ షూటింగ్లో టాలీవుడ్ హీరో మంచు విష్ణు గాయపడ్డాడు. న్యూజిలాండ్‌లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. అదుపుతప్పిన డ్రోన్ మంచు విష్ణుపై పడింది. దీంతో ఆయన చేతికి గాయాలయ్యాయి. వెంటనే షూటింగ్‌ను క్యాన్సిల్ చేశారు. వెంటనే మంచు విష్ణుకి చికిత్స స్టార్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితి ఇప్పుడు ఆగమాగం ఉంది. టికెట్లు దక్కినోళ్లు సంబరపడిపోతూ ప్రచారం మొదలు పెడితే.. టికెట్ దక్కనోళ్లు తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమకు టికెట్ దక్కకపోవడానికి టీపీసీసీ చీఫ్ రేవంతే కారణం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్‌లో సీట్ కన్ఫామ్ కాని నేతలు కొందరు పార్టీకి రాజీనామాలు చేస్తుంటే.. మరికొందరు రెబల్‌గా పోటీకి సిద్ధమవుతున్నారు. వెంగళరావు, షేక్ అబ్దుల్లా, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి వంటి వారు పార్టీకి రాజీనామా చేయగా.. కొందరు రెబల్‌గా పోటీ చేస్తామన్నారు.