North Korea: యుద్ధానికి కాలు దువ్వుతున్న కిమ్ జోంగ్ ...మిలిటరీకి పిలుపు..!!
ఉత్తరకొరియా యుద్ధానికి రెడీ అంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేయనున్న నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దేశ మిలిటరీకి అలర్ట్ గా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం ఆయుధ ఫ్యాక్టరీలో అధునాతన తుపాకులు సహా పలు ఆయుధాలను కిమ్ జోంగ్ పరిశీలించడం దీనికి మరింత బలం చేకూర్చుతోంది.