ఆంధ్రప్రదేశ్ శ్రీవారి లడ్డూతో ‘నెయ్యి’ నెయ్యం చెడింది..!? తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యత తగ్గుతోందా..!? క్వాలిటీ నెయ్యిస్థానంలో చవుకబారు నెయ్యి శ్రీవారి లడ్డు..లబ్ధ ప్రతిష్ట దెబ్బతీయనుందా.!? అంటే..అవుననేలాగే ఉన్నాయి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కెఎమ్ ఎఫ్)వ్యాఖ్యలు.నెయ్యి సరఫరా ధరకు సంబంధించిన ఎలాంటి సంతృప్తికరమైన కొటేషన్ ను టీటీడీ ఇంత వరకూ తమకు ఎలాంటి అధికారక సమాచారం ఇవ్వలేదని కెఎమ్ఎఫ్ తెలిపింది.ఈ మేరకు ఆదివారం మిల్క్ ఫెడరేషన్ అధ్యక్షుడు భీమ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.కెఎమ్ఎఫ్ చైర్మన్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఇక నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి ఈ-టెండర్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసేలా నిర్ణయించామన్నారు. దీనికి టీటీడీ స్పందించింది. టీటీడీ ఛైర్మన్ ధర్మారెడ్డి మాట్లాడుతూ కెఎంఎఫ్ చైర్మన్ చెప్పినట్లు ఇరవై ఏళ్ళుగా వారి నెయ్యి మాత్రమే కొనలేదన్నారు.టెండర్ల ద్వారా ఎవరు తక్కువ కోడ్ చేస్తే వారి నుండి కొనుగోలు చేస్తాం అది పూర్తిగా టీటీడీ మండలి నిర్ణయాధికారమని గుర్తుచేశారు. నాణ్యత ప్రమాణాలను పూర్తిగా ల్యాబ్ లో పరీక్షించే కొనుగోలు చేస్తామని ధర్మారెడ్డి తెలిపారు. By V. Sai Krishna 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn