NEET Scam : నీట్ పరీక్ష అక్రమాలపై సీబీఐ కేసు నమోదు..
నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం సీబీఐకి శనివారం అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సీబీఐ దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర విద్యాశాఖ సూచన మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.