ఐశ్వర్య రాయ్ లాంటి కండ్లు కావాలంటే రోజూ చేపలు తినండి... మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు...!
Maharashtra BJP Minister Claims Eating Fish Make Eyes Sparkle/ ఐశ్వర్య రాయ్ లాంటి కండ్లు కావాలంటే రోజూ చేపలు తినండి... మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు...!
Maharashtra BJP Minister Claims Eating Fish Make Eyes Sparkle/ ఐశ్వర్య రాయ్ లాంటి కండ్లు కావాలంటే రోజూ చేపలు తినండి... మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు...!
విపక్ష ‘ఇండియా’ కూటమి నిర్వహించే మూడవ సమావేశానికి ఆప్ నేతలు హాజరవుతారా? లేదా అనే అనుమానాలకు తెరపడింది. ముంబైలో నిర్వహించబోయే సమావేశానికి తాము హాజరవుతామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. తాము ముంబైకి వెళ్తామని, తమ వ్యూహమేంటో తెలియజేస్తామని మీడియాతో ఆయన అన్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పేరు, అధికారిక గుర్తుకు సంబంధించిన నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు మరి కొంత గడువు కావాలన్న శరద్ పవార్ వర్గం నేతల లేఖపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఎన్సీపీలోని ఇరు వర్గాల నేతలకు మరో మూడు వారాల గడువు ఇస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ల రహస్య భేటీ సంచలనం రేపుతోంది. వారి భేటీపై కాంగ్రెస్, శివసేన ఆందోళన చెందుతున్నాయి. ఆ విషయంపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చిస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇటు ఈ విషయాన్ని ఇండియా కూటమిలోనూ చర్చిస్తామని పేర్కొంటున్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రహస్య భేటీపై శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ ఇద్దరు నేతలు తమ సంబంధాలను కొనసాగిస్తున్నట్లయితే సిద్దాంతాల విషయంలో వారి మద్దతుదారులు ఒకరితో ఒకరు ఎందుకు పోట్లాడాలి అని ఆయన నిలదీశారు. భేటీ విషయంలో శరద్ పవార్ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.