Mary Kom: కీలక పోస్టుకు రాజీనామా చేసిన బాక్సర్ మేరీ కోమ్..
ప్రముఖ బాక్సర్ మేరీకోమ్.. ఫ్యారీస్లో జరగనున్న ఒలింపిక్స్ బృందానికి చీఫ్ డీ మిషన్‌గా వైదొలగినట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ పోస్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
ప్రముఖ బాక్సర్ మేరీకోమ్.. ఫ్యారీస్లో జరగనున్న ఒలింపిక్స్ బృందానికి చీఫ్ డీ మిషన్‌గా వైదొలగినట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ పోస్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
యూపీలోని వారణాసిలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయంలో విధులు నిర్వహించే పోలీసులకు యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కొత్త డ్రెస్‌కోడ్‌ను ప్రకటించింది. దీంతో వారు ఖాకీ దుస్తుల్లో కాకుండా ధోతీ-కుర్తాలతో అర్చకుల వస్త్రాధారణలో కనిపించడం వివాదస్పదమైంది.
జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో సుమారు 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తలపై రూ.కోటి రివార్డ్ ఉన్న మావోయిస్ట్ మిసిర్ బెస్రా బృందానికి చెందినవారు లొంగిపోయినట్లు పోలీస్ అధికారి పేర్కొన్నారు.
ప్రధాని మోదీ.. ఇండియన్ టాప్ గేమర్స్‌తో కలిసి సమావేశమయ్యారు. వాళ్లతో కలిసి మొబైల్, పీసీ, వీఆర్ ఆధారిత గేమ్స్ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో టీజర్‌ను బీజేపీ ఎక్స్(ట్విట్టర్)లో విడుదల చేసింది.
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన బియాంత్ సింగ్ కొడుకు సరబ్జిత్ సింగ్ ఖల్సా(45) లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పంజాబ్‌లోని ఫరీద్కోట్ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు.
బీహార్‌కు చెందిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కూతురు 'మిసా భారతి' సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశంలో జరిగిన ఎలక్టోరల్ బాండ్లు పెద్ద కుంభకోణమని.. ఇలాంటి అవినీతికి పాల్పడిన ప్రధాని మోదీ, బీజేపీ నేతలు జైలుకు వెళ్తారంటూ పేర్కొన్నారు.
పోలీసులు యునిఫాం బయట కనిపించే టాటూలను15 రోజుల్లోగా తొలగించాలని ఒడిశాలోని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించడంలో విఫలమైతే.. వాళ్లపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మహారాష్ట్రలోని ఓ క్యాంటిన్లో సమోసాల్లో కండోమ్‌లు, రాళ్లు, గుట్కా, పొగాకు వంటివి కనిపించాయి. ఇలాంటి దారుణానికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ కంపెనీ తనని కాదని వేరేవాళ్లకి క్యాటరింగ్ కాంట్రక్ట్ ఇవ్వడంతో.. పాతకాంట్రక్టర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.