Tension at Gannavaram: గన్నవరంలో టెన్షన్ వాతావరణం.. లోకేష్ పాదయాత్ర రూట్ మార్చిన పోలీసులు
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర గన్నవరంలో కొనసాగుతోంది. నారా లోకేష్ పాదయాత్ర రూట్ ను పోలీసులు మార్చడంతో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో హై టెన్షన్ నెలకొంది. ముందు రూట్ మ్యాప్ ప్రకారం ఎమ్మెల్యే వల్లభనేని ఆఫీసు ముందుగా లోకేష్ పాదయాత్ర వెళ్లాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే వంశీ.. ఆఫీసులోనే ఉండటంతో నారా లోకేష్ పాదయాత్ర అటువైపు వెళ్లకుండా పోలీసులు బార్కేడ్లు అడ్డుపెట్టారు.