Andhra Pradesh: యువగళం వాలంటీర్ల రుణం తీర్చుకోలేనిది.. నారా భువనేశ్వరి..
నారా లోకేష్ చేపట్టిన యువగళం ద్వారా పార్టీకి సేవ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్ల సేవలు మరిచిపోలేనివని నారా భువనేశ్వరి అన్నారు. యవగళంలో లోకేష్ తో పాటు సాగుతున్నారనే కారణంతోనే వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆమె అన్నారు. పార్టీ కోసం జైలుకు వెళ్లిన మీ రుణం తీర్చుకోలేనిదని యువగళం వాలంటీర్లను ఉద్దేశించి నారా భువనేశ్వరి అన్నారు.
Chandrababu Updates: చంద్రబాబుతో ములాఖత్.. బాబు ఆరోగ్యంపై చినరాజప్ప కీలక ప్రకటన..
రాజమండ్రి జైలులో ఉన్న ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబును ఈ రోజు నారా భువనేశ్వరి, బ్రహ్మణి, మాజీ హోం మంత్రి చిన రాజప్ప ములాఖత్ ద్వారా కలిశారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని ములాఖత్ తర్వాత చినరాజప్ప ప్రకటించారు. . అరాచక పాలనపై పోరాడాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారని చినరాజప్ప చెప్పారు.
Nara Bhuvaneshwari: గాంధీ లాంటి మహనీయుడుకి కూడా జైలు జీవితం తప్పలేదు..దీక్ష విరమించిన నారా భువనేశ్వరి!
మహాత్మాగాంధీ వంటి మహనీయుడికి కూడా జైలు తప్పలేదన్నారు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి. సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆమె రాజమండ్రిలో ఒక రోజు సత్యాగ్రహ దీక్ష చేశారు. భువనేశ్వరికి ఇది తొలి పూర్తిస్థాయి రాజకీయ పర్యటన. చిన్నపిల్లల చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని దీక్ష విరమించారు భువనేశ్వరి.
Posani Krishna Murali: బ్రాహ్మణి, భువనేశ్వరి భర్తలను మించిన భార్యలు.. పవన్ ఓ పిచ్చోడు: పోసాని సంచలన వీడియో
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి నారా బ్రాహ్మణి, భువనేశ్వరి భర్తలను మించిన భార్యలంటూ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాన్ పిచ్చోడు, అమాయకుడంటూ తీవ్ర వాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి.
Sajjala: టీడీపీ నేతల దీక్షలపై సజ్జల సెటైర్లు.. పూనకాలు వద్దంటూ పవన్ పై ఫైర్
చంద్రబాబు (Chandrababu) జైల్లో ఉంటే గాంధీని అవమానించేలా టీడీపీ నేతలు దీక్ష చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతలు మంచి లక్ష్యాలతో నిరాహారదీక్ష చేస్తే బాగుండేదన్నారు. చంద్రబాబు నవ నిర్మాణం అనేది ఉత్త బోగస్ అంటూ ఎద్దేవా చేశారు.
Chandrababu: దీక్షకు సిద్దమైన చంద్రబాబు.. ఎప్పుడంటే.!
అక్రమ అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు జైల్లో దీక్షకు దిగబోతున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు.
Nara Bhuvaneshwari: భువనేశ్వరి నిరాహార దీక్ష.. బాలకృష్ణ సంచలన ప్రకటన
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అక్టోబర్ 2వ తేదీన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టబోతున్నారని బాలకృష్ణ ప్రకటించారు. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగుతాయన్నారు.
Minister Roja: లోకేష్ ఎప్పుడైనా అలా చేశావా?: మంత్రి రోజా సంచలన వాఖ్యలు
టీడీపీ నేత నారా లోకేశ్ కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని రాష్ట్రపతిని కోరారని మంత్రి రోజా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేశ్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదంట అంటూ ఎద్దేవా చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Minister-Roja-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bhuvaneswari-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Nara-Bhuvaneshwari-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-Mulakath-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bhuvaneswari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Posani-Krishna-Murali-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Sajjala-Rama-Krishna-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-29-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Minister-RK-Roja-media-conference-in-Vijayawada--jpg.webp)