Nara Bhuvaneshwari: ప్రజాక్షేత్రంలోకి భువనేశ్వరి.. నారావారిపల్లెకి చంద్రబాబు సతీమణి! వాట్ నెక్ట్స్? By Trinath 22 Oct 2023 in తిరుపతి టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 23(రేపు)న తిరుపతికి రానున్నారు. 24న తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనంతరం నారావారిపల్లెకి వెళ్లనున్నారు. నారావారిపల్లెలో కులదైవం నాగాలమ్మకు, గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేయనున్నారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి, చంద్రబాబు తల్లిదండ్రులు నారా ఖర్జురపు నాయుడు సమాదులకు నివాళులర్పిస్తారు 25న చంద్రగిరిలో జరిగే ‘నిజం గెలవాలి’ తొలి బహిరంగ సభలో నారా భువనేశ్వరి పాల్గొంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలకు వివరించడంతోపాటు, సీఎం జగన్ ప్రజావ్యతిరేక పాలనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ నడుం బిగించింది. 'నిజం గెలవాలి' పేరుతో పర్యటన: భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి రావడం ఇదే మొదటిసారి. శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయా కార్యక్రమాలను ఖరారు చేశారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వీటిని ప్రకటించారు. నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో పర్యటించనున్నారు. ఈ పర్యటనను చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ప్రారంభించనున్నారు. భువనేశ్వరి ఈ నెల 24న తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లి బస చేస్తారు. మర్నాడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ‘నిజం గెలవాలి’ పర్యటనను ప్రారంభిస్తారు. చంద్రబాబు అరెస్టు విషయం తెలిసి మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారానికి రెండు మూడు నియోజకవర్గాల్లో ఆమె పర్యటన ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. చిన్న చిన్న సభలు, సమావేశాల్లో కూడా ఆమె పాల్గొంటారు. Also Read: ఆఖరి నిమిషంలో లిస్ట్ నుంచి వివేక్ పేరు ఔట్.. ఆయన దారెటు? అదేవిధంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను జాబితాల నుంచి తొలగించడం, అనర్హత ఓట్లను చేర్పించడంపై పార్టీ పోరు సాగించనుందని సమాచారం. ఈ మేరకు మూడు కార్యక్రమాల ద్వారా త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏపీ స్కి్ల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు చంద్రబాబు. ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ కూడా రాశారు. 'ప్రజలే నా కుటుంబం. జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్రజాజీవితం నా కళ్ల ముందు కదలాడుతోంది. నా రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి .. సంక్షేమమే లక్ష్యంగా సాగింది. దీనికి ఆ దేవుడితో పాటు మీరే సాక్ష్యం అని' లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. ఈ దసరాకి పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించానని.. అదే రాజమహేంద్రవరం జైలులో నన్ను ఖైదు చేశారన్నారు చంద్రబాబు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానన్నారు. నా ప్రజల కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పారు. Also Read: ఆలయ భూముల్లో వివాదం.. తెలంగాణ, ఏపీ బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత.. #nara-bhuvaneshwari #chandrababu-arrest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి